telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సినిమా వార్తలు

ఎస్పీబీకి అరుదైన గౌరవం…

SPB

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం తన గానామృతంతో యావత్ భారతాన్ని ఆకట్టుకున్నారు. అయితే ఈ మధ్యే ఆయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన అభిమానులను వదిలేసి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కరోనా బారిన పడి ఆస్పత్రిలో చికిత్స పొందిన ఆయన.. కోలుకుంటున్నారని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్న సమయంలో సెప్టెంబర్ 25న కన్నుమూశారు బాలు. అయితే, ఎస్పీ బాలుకు అరుదైన గౌరవం కల్పించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. నెల్లూరులోని ప్రభుత్వ సంగీత మరియు నృత్య పాఠశాలకు ఆయన పేరు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు.. ఇకపై డాక్టర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం మ్యూజిక్ అండ్ డాన్స్ స్కూల్‌గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది సర్కార్.  ఇక, ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌.. మంత్రి గౌతమ్ రెడ్డికి ట్వీట్‌ను రీట్వీట్ చేసి.. ఏపీ ప్రభుత్వానికి, సీఎం వైఎస్‌ జగన్‌కు ధన్యవాదాలు తెలిపారు.. నెల్లూరులోని మ్యూజిక్‌, డ్యాన్స్‌ ప్రభుత్వ పాఠశాలకు డాక్టర్‌ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం పేరు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు ఎస్పీ చరణ్‌. కాగా.. మరోవైపు.. ఎస్పీ బాలుకు భారతరత్న ప్రకటించాలని కేంద్రప్రభుత్వాన్ని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.

Related posts