telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

అమెరికాలో కుటుంబ సభ్యులపై కాల్పులు.. భార్యతో సహా కుమారులు మృతి

gun fire

అమెరికాలో ఓ వ్యక్తి తన కుటుంబ సభ్యులపై కాల్పులకు తెగబడ్డాడు. కాలిఫోర్నియా సమీపంలో శాన్ డియాగో నగరంలోజరిగిన ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని అక్కడి మీడియా పేర్కొంది. ప్రాణాలు కోల్పోయిన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారని వివరించింది.కాల్పులకు తెగబడిన వ్యక్తికి 31 ఏళ్లు ఉంటాయని, తన మాజీ భార్యతో విభేదాల కారణంగా ఈ ఘటనకు పాల్పడ్డాడని అక్కడి మీడియా తెలిపింది.

ఈ కాల్పుల్లో అతడి మాజీ భార్యతో పాటు 9 ఏళ్లలోపు ఉన్న ముగ్గురు కుమారులు మృతి చెందారని పేర్కొంది. అనంతరం తాను కూడా కాల్చుకొని ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పింది. ఈ కాల్పుల్లో 11 ఏళ్ల మరో బాలుడు గాయపడ్డాడని, అతడికి ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారని తెలిపింది.

Related posts