telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుట్టినరోజున మెగా హీరో తీసుకున్న మంచి నిర్ణయం… అభిమానులు ఫిదా

Sai-Dharam-Tej

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ నటించిన “చిత్ర‌ల‌హ‌రి” ఇటీవలే విడుదలై మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రం ఇచ్చిన బూస్ట్ తో సాయిధరమ్ తేజ్ చేస్తున్న త‌ర్వాత చిత్రం “ప్రతిరోజు పండగే”. ఈ చిత్రానికి మారుతి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న సంగ‌తి తెలిసిందే. “ప్ర‌తిరోజు పండ‌గే” అనే టైటిల్‌తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్, యువీ క్రియేష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో సాయిధరమ్ తేజ్ సరసన రాశి ఖ‌న్నా క‌థానాయిక‌గా న‌టిస్తుంది. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో స‌రికొత్త లుక్‌లో తేజూ క‌నిపించ‌నున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ షెడ్యూల్ పూర్తవ్వగానే చిత్ర బృందం అమెరికా వెళ్లనున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌కు మంచి స్పందన లభించిన విషయం తెలిసిందే. కాగా అక్టోబర్ 15న హీరో సాయి తేజ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సాయి తేజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ ‘ప్రతిరోజూ పండగే’ చిత్రయూనిట్ టీజర్ ను విడుదల చేశారు. ఈరోజు 33వ పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.ఈ సందర్భంగా సందర్భంగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటోంది.

కాగా… సాయి తేజ్ ఎన్నో సేవా కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని అభిమానులను పెంచుకుంటున్నారు. తాజాగా త‌న బ‌ర్త్‌డే రోజు గొప్ప నిర్ణ‌యం తీసుకున్నాడు. మ‌ధ్య‌లో ఆగిపోయిన ఓల్డేజ్ హోమ్ నిర్మాణం పూర్త‌య్యేవ‌ర‌కు తాను పూర్తి బాధ్య‌త వ‌హిస్తాన‌ని మాటిచ్చాడు. అంతేకాదు సంవ‌త్స‌రం పాటు ఓల్డేజ్ హోమ్ ర‌న్ అవ‌డానికి కావ‌ల‌సిన మొత్తాన్ని తాను స‌మ‌కూరుస్తానని తేజూ చెప్పుకొచ్చాడు. ఈ కార్య‌క్ర‌మంలో పాలు పంచుకున్న మెగా ఫ్యాన్స్ అంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశాడు. “ఇదేదో గొప్ప‌లు చెప్పుకోవ‌డానికి ప‌బ్లిక్ డొమైన్‌లో మాట్లాడ‌డం లేదు. నన్ను చూసి చిన్న పిల్లాడు లేదా పెద్ద వాళ్లు ఎవ‌రో ఒక‌రు ఇన్‌స్పైర్ అయిన చాల‌నే చిన్న కార‌ణంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను” అని తేజూ స్ప‌ష్టం చేశాడు. పుట్టిన రోజు నాడు తేజు తీసుకున్న ఈ మంచి నిర్ణ‌యంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Related posts