telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

గాయపడిన మనసు…

గుండెల్లో ప్రతిరోజూ…
నీల తలపుతో పులకింత..
కళ్లలో ప్రతిరోజూ
నీ రూపే కలగంటా..

నీవు లేని నా మనసులో నేనైనా లేనంటా..
నీతోడే లేకుంటే వలపైనా విషమంటా..
నివ్వేనా వశమైతే అదృష్టం నా వెంట..
చిరకాలం నా తోడై నువ్వుంటే చాలంటా..!
……..

గాయపడిన మనసుకు
ఓదార్పు నీ ప్రేమ
అలుపెరుగని అడుగులకు
గమ్యం నీ ప్రేమ
కనుకెరుగని కనుపాపలో
చిరుస్వప్నం నీ ప్రేమ
కారు మబ్బుల చీకటిలో
చిరుదీపం నీ ప్రేమ
చిరకాలం ఉండాలి నాతోనే నీ ప్రేమ
కలనైనా మరువలేను కమ్మనైన నీ ప్రేమ

Related posts