telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పాత ప‌థ‌కాల‌కే కొత్త పేర్లు.. వైసీపీ సర్కార్ పై దేవినేని విమర్శలు

devineni on power supply

పాత ప‌థ‌కాల‌కే కొత్త పేర్లు పెట్టి వైసీపీ ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌ను మ‌భ్య పెడుతోందని టీడీపీ నేత దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు మండిప‌డ్డారు. ఈ మేరకు ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన ఓ క‌థ‌నాన్ని పోస్ట్ చేశారు. ఏపీ స‌ర్కారుపై పాత పథకాలకే కొత్త పేర్లు పెడుతూ రాజ‌కీయ లాభం పొందాల‌నుకుంటోందని దుయ్యబట్టారు.

కార్పొరేషన్‌ పద్దులోనే ఆసరా, ఇతర పథకాలు ఉన్నాయ‌ని, అంతేగాక‌, ఇచ్చేదానిలోనూ ఎన్నో కోతలు, ఆంక్షలు ఉంటున్నాయ‌ని చెప్పారు.చంద్ర‌బాబు నాయుడి పాల‌న‌లో తీసుకొచ్చిన‌ ‘పసుపు కుంకుమ’లో ప్రతి డ్వాక్రా మహిళకు లబ్ధి చేకూరింద‌ని, ఇప్పుడు ‘ఆసరా’గా తెస్తున్న అదే స్కీంలో ఎన్నో చిక్కులు ఉన్నాయ‌ని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు.

కార్పొరేషన్స్, సబ్ ప్లాన్ ల నిధుల మళ్లింపు, దళిత పారిశ్రామిక వేత్తల ప్రోత్సాహం 45 నుంచి 15 శాతానికి తగ్గింపు. ఇలా తెలుగు దేశం పార్టీ తీసుకొచ్చిన పథకాలకే పేర్లు మార్చి, కోతలు కోసి కొత్త పేర్లతో ఏమార్చడం తప్ప మీరేం చేశారో చెప్పండని ప్రభుత్వాన్ని ప్ర‌శ్నించారు.

Related posts