telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో మరోసారి ఎన్నికలు…

ఇన్ని రోజులు ఏపీ వరుస ఎన్నికలతో ఊగిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ తిరుపతి ఉప ఎన్నికల జోరు కొనసాగుతుంది. అయితే తెలంగాణలో కూడా నాగార్జున సాగర్ ఉప ఎన్నికల వేడి పెరుగుతుంది. అయితే ఇప్పుడు తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం అయ్యింది.  ఐదు మున్సిపాలిటీలు, రెండు కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈనెల 16 వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.  ఈనెల 20 న నామినేషన్ల స్క్రూటినీ, 21 వ తేదీన నామినేషన్ల విత్ డ్రాకు అవకాశం ఉంటుంది.  ఈనెల 28 వరకు ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండగా, ఏప్రిల్ 30 వ తేదీన ఎన్నికల నిర్వహణ ఉంటుంది.  ఇక మే 3 వ తేదీన ఫలితాలు ఉంటాయి.  కరోనా నిబంధనలో భాగంగా నామినేషన్ల కోసం రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. అయితే చూడాలి మరి ఈ ఎన్నికలో ఎవరి విజయం సాధిస్తారు అనేది.

Related posts