telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ కారణంగానే మొదటి స్థానానికి వచ్చా : బాబర్

తాజాగా ఐసీసీ విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్‌లో విరాట్ కోహ్లీని వెనక్కినెట్టి అగ్రస్థానాన్ని అందుకున్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 103, 31, 94తో రాణించిన బాబర్ ఆజామ్.. 228 రన్స్‌తో రాణించి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో వన్డే ర్యాంకింగ్స్‌లో నెం1 స్థానాన్ని అందుకున్నాడు. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడిన విరాట్.. హాఫ్ సెంచరీలతో రాణించినా తన మార్క్ పెర్ఫామెన్స్ రాణించలేకపోయాడు. దాంతో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలిచిన సందర్భంగా సహచర క్రికెటర్ ఇమామ్ ఉల్ హక్‌తో బాబర్ చిట్‌చాట్ చేయగా.. ఆ వీడియోను పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ చిట్ చాట్ సందర్భంగా కోహ్లీ ఇచ్చిన సలహాను బాబర్ గుర్తు చేసుకున్నాడు. ‘గతంలో నేను నెట్ ప్రాక్టీస్‌ ను చాలా లైట్ తీసుకునేవాడిని. ఆ తర్వాత నెమ్మదిగా ఈ అలవాటును మార్చుకున్నా. నెట్ సెషన్స్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకున్నా. అక్కడ కష్టపడితేనే మైదానంలో సత్తా చూపగలమని గ్రహించా. ఈ క్రమంలోనే ఓసారి విరాట్ కోహ్లీతో మాట్లాడినప్పుడు అతను నాకు విలువైన సలహా ఇచ్చాడు. నెట్ సెషన్స్‌ను మ్యాచ్‌లానే భావించాలని కోహ్లీ సూచించాడు. ఎందుకంటే నెట్స్‌లో నిర్లక్ష్యపు షాట్స్ ఆడితే మ్యాచ్‌లో కూడా అలానే ఆడుతామని చెప్పాడు. నెట్స్‌లో మన ప్రవర్తన ఎలా ఉంటే మ్యాచ్‌లో కూడా అలానే ఉంటుందన్నాడు. అతని సలహా నాకు చాలా ఉపయోగపడింది. అప్పటి నుంచి నేను ప్రాక్టీస్ సెషన్‌లో చాలా సిరీయస్‌గా పాల్గొంటున్నా అని బాబర్ చెప్పుకొచ్చాడు.

Related posts