telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీపై ఆర్బీఐ నివేదిక…

Reserve Bank of India RBI

కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్‌ ల‌తో ప్రజలు ప‌ట్ట‌ణాల‌ను వ‌ద‌లి.. ప‌ల్లె బాట ప‌ట్టారు.. ఇవ‌న్నీఆర్థిక వ్య‌వ‌స్థను కుదిపేసింది.. అయితే, ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీపై తాజాగా ఆర్బీఐ నెల‌వారీ నివేదిక విడుద‌ల చేసింది.. దేశంలో క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగ‌వంతం చేయ‌డంపైనే ఆర్థిక వ్య‌వ‌స్థ రిక‌వ‌రీ ఆధార‌ప‌డి ఉంద‌ని ఆర్బీఐ పేర్కొంది.. ఇక‌, క‌రోనా మ‌హ‌మ్మారి నుంచి బయ‌ట‌ప‌డి ముందుకువెళ్లే స‌త్తా మ‌న ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఉంద‌ని ఆర్బీఐ నివేదిక చెబుతోంది.. అయితే, మ‌హ‌మ్మారి ప్ర‌భావాల‌ను త‌ట్టుకుంటూ ముందుకు సాగాల్సి ఉంటుంద‌ని తెలిపింది.. కోవిడ్ సెకండ్ వేవ్ ప్ర‌భావం.. ప్ర‌ధానంగా దేశీయ డిమాండ్ ను దెబ్బ‌తీసింద‌ని.. కానీ, వ్య‌వ‌సాయ దిగుబ‌డుల స‌ర‌ఫ‌రాలు, సేవ‌ల రంగం ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు సానుకూలంగా ఉన్న‌ట్టు పేర్కొంది. అయితే చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts