telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

ష‌ర్మిల‌పై కౌంట‌ర్ ఎటాక్‌కు దిగ్గిన హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే…

హుజూర్‌న‌గ‌ర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి వైస్ షర్మిల పై మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నార‌న్న సైదిరెడ్డి.. మీరు ఉద్దరించేది ఇక్క‌డ ఏమి లేద‌ని మండిప‌డ్డారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణాన‌ది నుండి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల అనుమతి లేకుండా.. కృష్ణా బోర్డు నియమాలకు వ్యతిరేఖంగా.. 4 టీఎంసీల నీరు దౌర్జన్యంగా ఆంధ్రాకు తరలిస్తున్నారని.. దీనికి షర్మిలమ్మ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.. కాగా, ఇవాళ నేరేడుచ‌ర్ల మండ‌లం మేడారం వెళ్లారు ష‌ర్మిల‌.. ఆ గ్రామానికి చెందిన నీల‌కంఠ సాయి అనే నిరుద్యోగి.. ఉగ్యోగాల‌కు నోటిఫికేష‌న్లు లేవ‌న మ‌న‌స్తాపంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేశాడ‌ని తెలుస్తుండ‌గా.. ష‌ర్మిల అత‌నిని ప‌రామ‌ర్శించాల్సి ఉంది.. కానీ, స‌ద‌రు కుటుంబం ఇంటికి తాళం వేసి ఎటో వెళ్లిపోయింది.. దీంతో.. ఎమ్మెల్యేపై ష‌ర్మిల అనుచ‌రులు విమ‌ర్శ‌లు చేసిన‌ట్టుగా తెలుస్తుండ‌గా.. దీంతో ష‌ర్మిల‌పై కౌంట‌ర్ ఎటాక్ చేశారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.

Related posts