తమిళనాడులో చిక్కుకున్న ఆంధ్ర వలస కార్మికులను ఆడుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తమిళనాడు సీఎం పళనిస్వామి, కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ భల్లాకు ఓ లేఖ రాశారు. ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు చెందిన 1500 మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ మే 3 వరకు పొడిగించిన కారణంగా భనవ నిర్మాణ కార్మికులకు నిత్యావసరాలు అందించాలని కోరారు. అక్కడ చిక్కుకుపోయిన కార్మికుల యోగ క్షేమాల గురించి వారి కుటుంబసభ్యులు ఆందోళనతో ఉన్నారని ఆ లేఖ ద్వారా వారి దృష్టికి తెచ్చారు. ఆయా కార్మికులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు, వివరాలను ఆ లేఖలో పొందుపరిచారు.
డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్కు వ్యాఖ్యాతగా దినేష్ కార్తీక్…?