telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు హఠన్మారణం

vanisri

సీనియర్ నటి వాణిశ్రీ కుమారుడు చెన్నైలో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు. వాణిశ్రీ కుమారుడు డాక్టర్ అభినయ్ వెంకటేశ్ కార్తీక్ (36) నిద్రలోనే గుండెపోటుతో చనిపోయాడు. చెన్నైలోని తన నివాసంలోనే అభయ్ మృతిచెందినట్టు కుటుంబసభ్యులు వెల్లడించారు. కార్తీక్ అన్నపూర్ణ మెడికల్ కాలేజీలో మెడిసిన్ పూర్తిచేసిన అభియన్ వెంకటేశ్ నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. అభియన్‌కు భార్య, ఓ కుమారుడు (4) ఉన్నాడు. ఆయన భార్య కూడా వైద్యురాలే. రామచంద్రన్ మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గానూ పనిచేశాడు. దశాబ్ద కాలం పాటు తెలుగు చిత్ర సీమలో కథానాయికగా వెలిగిన కళాభినేత్రి వాణిశ్రీ.. తమిళ, కన్నడ, మళయాళ చిత్రాలలో కూడా ఆమె తన ప్రతిభను చాటుకున్నారు. వివాహం తర్వాత సినిమాలకు కొంతకాలం స్వస్తి చెప్పారు. ఫ్యామిలీ డాక్టర్‌నే వివాహం చేసుకున్న వాణిశ్రీకి ఒక కుమారుడు.. ఒక కుమార్తె ఉన్నారు. వారు మాత్రం సినిమాలకు దూరంగా ఉన్నారు.

Related posts