telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మరో రికార్డును క్రియేట్ చేసిన “హౌజ్‌ఫుల్ 4”

House-Full

బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ హౌజ్ ఫుల్ ఫ్రాంచైజీలో భాగంగా “హౌజ్‌ఫుల్ 4” చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. కృతి సనన్, రితేష్ దేశ్‌ముఖ్‌, పూజా హెగ్డే, బాబి డియోల్‌, కృతి కర్భందా చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. చిత్రంలో అక్షయ్ కుమార్ బాలా మరియు హర్రి పాత్రలలో కనిపించి మెప్పించాడు. ఫన్ అండ్ హ్యూమర్‌తో పీరియాడికల్ మూవీగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని 2019 డిసెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌గా, రీసెంట్‌గా స్టార్ గోల్డ్ ప్ర‌సారం చేసింది. ఈ చిత్రానికి రికార్డ్ వ్యూయ‌ర్ షిప్ ద‌క్కింది. 4.1 బిలియ‌న్ల వ్యూయింగ్ మినిట్స్ ద‌క్కాయ‌ని అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్‌లో ఈ చిత్రం బుల్లితెరపై ప్ర‌సారం కాగా, అప్పుడు 2.15 కోట్ల వ్యూయ‌ర్‌షిప్ ల‌భించింది. త‌మ చిత్రానికి ల‌భించిన అరుదైన రికార్డుకి చిత్ర బృందం సంతోషంగా ఫీల‌వుతుంది. ఈ చిత్రాన్ని మొదట సాజిద్ ఖాన్ తెరకెక్కించగా ఆయనపై వచ్చిన లైంగిక ఆరోపణల వలన ఆయన స్థానంలో ఫహద్ సంజీని దర్శకుడిగా ఎంపిక చేశారు. ఇక నానా పటేకర్ స్థానంలోపై కూడా లైంగిక ఆరోపణలు రాగా ఆయన స్థానంలో రానాని తీసుకున్నారు.

Related posts