telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలు ఆరోగ్యంపై కన్నీటి పర్యంతం అయిన రమాప్రభ

SPB

కరోనాతో పోరాడుతున్న లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటూ తీవ్ర భావేద్వేగానికి లోనైంది సీనియర్ నటి రమాప్రభ. కరోనా సోకి గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న బాలు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలిసి ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, ఆయన అభిమానులు బాలు కోలుకోవాలని కోరుకుంటూ పెద్దఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలు ఆరోగ్యంపై స్పందించిన అలనాటి నటి రమాప్రభ కన్నీటి పర్యంతం అయింది. ”తన పాటతో కోట్లానుకోట్ల మందిని ఆనందింపజేసిన మన బాలుకి పాజిటివ్ ఏంటి? చాలా బాధగా ఉంది. మర్యాద రామన్న సినిమాలో ‘గాడిదా గాడిదా’ అనే పాట బాలు మొట్టమొదట పాడిన పాట. ఆ సినిమాకు ప్రొడ్యూసర్, డైరెక్టర్ మన పద్మనాభం గారు. ఆ సమయంలో బాలుతో నాకు పరిచయం లేదు. కొద్ది రోజుల తరువాత ‘మహమ్మద్ బీన్ తుగ్లక్’ అనే సినిమాలో నా ”హ్యాపీ బర్త్ డే టు యూ” అనే పాట పాడాడు. అదే ఫస్ట్ టైమ్ ఆయన్ను కలవడం. అప్పుడు చిన్నోడే. ఆ సమయంలో ఆర్టు ఆర్టు కలిసి మా మధ్య అలా మొదలైన స్నేహం చాలా స్ట్రాంగ్ అయింది. కొద్ది కాలానికి చక్రవర్తి, నేను, బాలు ఓ ట్రూప్‌లా ఏర్పడి కొన్నేళ్ల పాటు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాము. సినిమాకు సంబంధం లేని పరిచయం మాది. ఆ తరువాత కొన్ని ప్రోగ్రామ్స్‌లో బాలు పాడుతుంటే నేను డాన్స్ చేయడం చూస్తూ ఎంతో మంది ఎంజాయ్ చేశారు. అంతమందిని అలరించిన బాలు కోసం దయచేసి అందరూ ప్రే చేయండి. మన ప్రార్థనలే అతని బలం. బాలు మళ్ళీ రావాలి.. ఆ గాంధర్వ గాయకుడి పాట మనమంతా వినాలి” అంటూ ఎమోషనల్ అయ్యింది రమాప్రభ.

Related posts