telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చూసీ చూడంగానే : “నీ ప‌రిచ‌య‌ముతో…” అంటూ ఆకట్టుకుంటున్న సిద్ శ్రీరామ్ సాంగ్

CC

“పెళ్ళిచూపులు”, “మెంటల్ మదిలో” చిత్రాలను నిర్మించిన నిర్మాత రాజ్ కందుకూరి త‌న‌యుడు శివ కందుకూరి ప్ర‌ధాన పాత్ర‌లో శేష్ సింధూ రావ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం చూసీ చూడంగానే. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో వ‌ర్ష బొల్ల‌మ్మ‌, మాళ‌వికా స‌తీష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇద్ద‌రు అమ్మాయిల‌తో అబ్బాయి న‌డిపే ప్రేమ నేప‌థ్యంలో చిత్రాన్ని రూపొందిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ధ‌ర్మ‌ప‌థ క్రియేష‌న్స్ ప‌తాకంపై రాజ్ కందుకూరి సినిమాని నిర్మిస్తున్నారు. గోపి సుందర్ ‘చూసీ చూడంగానే’ చిత్రానికి సంగీతం సమకూర్చగా, సిరివెన్నెల, అనంత్ శ్రీరామ్, రామజోగయ్య, విశ్వా సాహిత్యం అందించారు. పవిత్ర లోకేష్,రాజేష్ ఖన్నా, వెంకటేష్ కాకుమాను,అనీష్, గురు రాజ్ ఇతర పాత్రలలో నటించారు. ఇటీవ‌ల చిత్ర టీజర్ విడుద‌ల కాగా, దానికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా చిత్రం నుండి “నీ ప‌రిచ‌య‌ముతో…” అంటూ సాగే పాట విడుద‌ల చేశారు. ఈ పాటని సిద్ శ్రీరామ్ ఆల‌పించగా, ఇది సంగీత ప్రియుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. మీరు కూడా ఈ సాంగ్ ను వీక్షించండి.

Related posts