telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

20వ పుట్టినరోజు జరుపుకున్న బాలీవుడ్ బాద్ షా కూతురు

Suhana

శుక్రవారం బాలీవుడ్ బాద్ షా షారూఖ్ ఖాన్ గారాల పట్టి సుహాన ఖాన్ 20వ పుట్టినరోజు. ఈ సంద‌ర్భంగా త‌న బ‌ర్త్‌డేని ముంబైలోని మ‌న్న‌త్‌లో జ‌రుపుకుంది. ఇక లాక్‌డౌన్ బ‌ర్త్‌డేకి సంబంధించిన వీడియో ఒక‌టి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఇది అభిమానుల‌ని ఆక‌ట్టుకుంటుంది. ఇటీవ‌ల గౌరీ ఖాన్ త‌న కూతురు సుహానాని ఓ ఫ్రొఫెష‌న‌ల్ త‌ర‌హాలో ఫోటోషూట్ చేసింది. సుహానా త‌న ఫోట‌లోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయ‌గా, అవి ఫ్యాన్స్‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయి. సుహానా ప్ర‌స్తుతం న్యూయార్క్ వ‌ర్సిటీలో యాక్టింగ్ కోర్సు చ‌దువుతున్న‌ది. ఏడాది క్రిత‌మే ఆమె ఈ కోర్సులో చేరింది. ఇంగ్లండ్‌లోని అర్డింగ్లీ కాలేజీ నుంచి త‌న గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసుకున్న సుహానా త్వ‌ర‌లో వెండితెర ఎంట్రీ ఇవ్వ‌డం ఖాయం అని చెబుతున్నారు.

Related posts