తూర్పు లండన్‌లోని దగెన్హాంలో గల ఆస్దా సూపర్ మార్కెట్‌కు ఇద్దరు మహిళలు బుర్ఖా వేసుకొని వెళ్లారు. ఆ తరువాత మార్కెట్ లోపల సిబ్బందిలేని సమయం చూసి తమకు కావాల్సిన వస్తువులను బుర్ఖాలోపల ఏర్పాటు చేసిన జేబుల్లో వేసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బయటపడబోయారు. అయితే, అక్కడే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఆ ఇద్దరు మహిళల నడకలో తేడా కనిపించడంతో వారిని ఆపారు. ఆ తరువాత వారిద్దరిని మహిళ సిబ్బందితో తనిఖీ చేయించారు. ఈ సోదాల్లో వారు బుర్ఖాలో దాచిపెట్టిన వస్తువులు బయటపడ్డాయి. దాంతో ఒక్కొక్కటిగా వాటిని బయటపెట్టారు ఆ ఇద్దరు మహిళలు. వారి చుట్టూ గుమిగూడిన గుంపు మధ్యలోనే వారిద్దరి చేత వస్తువులను బయటకు తీయించారు. దాంతో ఇద్దరు కలిసి పదుల సంఖ్యలోనే వస్తువులను దొంగలించబోయారని తెలిసింది. చివరకు ఓ మహిళ మొత్తం వస్తువులు బయటపెట్టిన తరువాత… సిబ్బంది ఆమెను లోపల ఇంకా ఏమైనా ఉన్నాయా? అని ప్రశ్నించడంతో సదరు మహిళ తన బుర్ఖా మొత్తాన్ని పైకిలేపి పొట్ట, లోదుస్తులు కనిపించేలా చూపించి అక్కడి నుంచి వెళ్లిపోయింది. కాగా, సూపర్ మార్కెట్ యజమాని వారిద్దరిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదని సమాచారం. అయితే, సదరు మహిళలు నిజంగా ముస్లిం మహిళలేనా? లేక స్టోర్‌లో దొంగతనం కోసం బుర్ఖా వేసుకొని వచ్చారా? అనేది తెలియరాలేదు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది.
previous post