సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన “దర్భార్” వచ్చే ఏడాది పొంగల్‌కు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తరువాత రజనీకాంత్ నటించనున్న 168వ చిత్రం గురించి ఆసక్తికరమైన విషయాలు బయటికొస్తున్నాయి. సిరుతై శివ దర్శకత్వం వహించబోతున్న ఆ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్‌గా ఎంపిక కాగా, తొలిసారి రజనీ సినిమా బాణీలు కట్టే అవకాశం డి.ఇమాన్‌కు దక్కింది. సన్ పిక్చర్స్ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ను డిసెంబర్ 12న రజనీ పుట్టినరోజు సందర్భంగా ప్రారంభించనున్నారు. ప్రస్తుతం తారాగణం ఎంపిక జరుగుతోంది. తాజా సమాచారం ఏమిటంటే.. రజనీ 168లో నిన్నటితరం అందాలరాశి ఖుష్బూ ఒక ముఖ్య పాత్రలో నటించనుందట. సీనియర్ నటీమణులు పలువురి పేర్లు పరిశీలించిన తరువాత చివరికి ఖుష్బూకే అందరూ ఓటేశారట. 1980ల్లో రజనీ, ఖుష్బూ జోడీగా వచ్చిన చిత్రాలు సూపర్‌హిట్ అయ్యాయి. ఆ కోవలోనే రాబోయే సినిమా కూడా పెద్ద హిట్టవుతుందని అభిమానులు నమ్ముతున్నారు.
previous post