telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం ప్రియులకు షాక్… మళ్లీ పెరిగిన ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. బంగారాన్ని కొనడానికి మహిళలు చాలా ఇష్టపడతారు. అయితే.. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ.10 పెరిగి రూ. 48,060 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 44,060 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 220 పైకి ఎగసి రూ. 45,710 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ. 41,900 పలుకుతోంది. అయితే బంగారం పైకి లేస్తే వెండి ధరలు మాత్రం నిలకడగా ఉన్నాయి. కిలో వెండి ధర రూ. 69,300 వద్ద కొనసాగుతోంది.

Related posts