telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

కలకలం రేపుతున్న మాజీ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్

మాజీ ఎమ్మార్వో నాగరాజు చివరిసారి వీడియో కాల్ కలకలం రేపుతోంది. చివరి సారిగా చనిపోడానికి ముందు కుటుబంతో వీడియో కాల్ మాట్లాడిన నాగరాజు…రెండవ కేసులో ఏసీబీ కస్టడికి తీసుకోడానికి ముందు కేసు విషయంలో సంభాషణలు బయటపడ్డాయి. ఈ సంభాషణల్లో తాను ఏతప్పు చేయలేదు ప్రాపర్ గానే ఉన్నాయని చెప్పిన నాగరాజు…అవన్ని రికార్డ్స్ పరిశీలించే చేశామన్నాడు.
ఫాబ్రికేట్ సర్టిఫికెట్స్ కావు వెరిఫై చేసే చేశామన్న ఎమ్మార్వో…న్యాయవాదికి చెప్పి కోర్టులో తెలపాలని కుటుంబానికి విన్నవించుకున్నాడు. బెయిల్ పై బయటకు వచ్చాక కోర్టులో చూద్దాం అని కుటుంబ సభ్యులు హితవు పలికారు. కాగా..నాగరాజు ఈ నెల 14 న ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో కోటి పది లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేసి ఎసిబికి చిక్కిన నాగరాజు… చంచల్ గూడ జైల్లో ఉన్నాడు నాగరాజు. ఈ నెల 14 న జైల్లోనే ఆత్మహత్య తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే నాగరాజు ఆత్మహత్యపై ఆయన భార్య అనుమానాలు వ్యక్తం చేస్తోంది. నాగరాజును హత్య చేసారని ఆరోపణలు చేస్తోంది. 

Related posts