telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం కొనేవారికి షాక్‌.. భారీగా పెరిగిన ధరలు

ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్‌ దేనికి ఉండదు. బంగారాన్ని కొనడానికి మహిళలు చాలా ఇష్టపడతారు. అయితే.. బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పెరిగిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 100 పెరిగి రూ. 48,160 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90 పెరిగి రూ. 44,150 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 120పైకి ఎగసి రూ. 45,820 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 100 పెరిగి రూ. 42,000 పలుకుతోంది. బంగారం ధరలు పెరగగా… వెండి ధరలు మాత్రం భారీగా పడిపోయాయి. కిలో వెండి ధర రూ. 300 తగ్గి రూ.69,400 వద్ద కొనసాగుతోంది.

 

 

Related posts