telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

రాజకీయాల్లో చేరే ఉద్దేశం లేదు..ఐపీఎస్ అధికారి వీకే సింగ్

Vk singh IPS Telangana

రాజకీయాల్లో చేరే ఉద్దేశం తనకు లేదని తెలంగాణ ఐపీఎస్ అధికారి వీకే సింగ్ స్పష్టం చేశారు. తన ఉద్యోగానికి రాజీనామా చేసిన సింగ్ తన రాజీనామాను ఆమోదించాలంటూ కేంద్రం హోంశాఖకు లేఖ రాశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగ పరంగా అత్యంత శక్తవంతులైన ప్రజలు బలవంతుల చేతుల్లో కీలు బొమ్మలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇందుకు రాజకీయ నాయకులను బాధ్యులను చేయలేమని, తప్పంతా ప్రజల్లోనే ఉందని అన్నారు.

ఏ రాజకీయ నాయకుడూ రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేరని చెప్పిన ఆయన ప్రజలు మాత్రమే ఆ పని చేయగలరన్నారు.వివేకానంద, సుభాష్ చంద్రబోస్, మహాత్మాగాంధీ బాటలో నడుస్తూ ప్రజలతో కలిసి పనిచేస్తానని అన్నారు. అన్నాహజారే చేస్తున్న పనిని తాను కొనసాగిస్తానని పేర్కొన్నారు. తన రాజీనామాకు అనుమతి వచ్చిన తర్వాత తన ప్రణాళికను వివరిస్తానని తెలిపారు.

Related posts