telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్ లు వేసేలా ఏపీ చర్యలు

Corona Virus Vaccine

నేడు ఏపీలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. ఇవ్వాళ ఒక్కరోజే 8 లక్షల వ్యాక్సిన్లు వేసేలా లక్ష్యం పెట్టుకుంది. అన్ని జిల్లాల కలెక్టర్లకు వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలు జాతి చేసారు. ఇప్పటికే ఒక్కరోజులోనే 6 లక్షల వ్యాక్సిన్లు వేసి చరిత్ర సృష్టించిన ఏపీ ప్రభుత్వం… ఇప్పటివరకు మొత్తం కోటి 22లక్షల 83వేల 479 డోసులు వేసింది. ఇప్పటివరకు 5లక్షల 29వేల మంది ఐదేళ్లలోపు పిల్లల తల్లులకు తొలి డోస్ ఇచ్చారు. ఇక ఏపీలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుతున్న విషయం తెలిసిందే. రోజువారీ కేసులు 20 వేల నుండి 6 వేలకు పడిపోయాయి. 

Related posts