యూపీ పోలీసులు చట్ట విరుద్ధమైన మత మార్పిడుల నిరోధక ఆర్డినెన్స్‌ను కారణంగా చూపుతూ ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు. లక్నోలో పోలీసులు ఒక హిందూ మహిళ మరియు ఒక ముస్లిం పురుషుడి మధ్య వివాహ వేడుకను అడ్డుకున్నారు. ఈ వివాహం బుధవారం లక్నోలోని పారా ప్రాంతంలో జరగాల్సి ఉంది. వేడుకలు ప్రారంభం కావడానికి కొద్ది నిమిషాల ముందు, ఒక పోలీసు బృందం వేదిక వద్దకు చేరుకున్నారు. రెండు కుటుంబాలను పోలీస్ స్టేషన్ కి రావాలని ఆదేశించారు. కొత్త ఆర్డినెన్స్ ప్రకారం.. మతాంతర వివాహం చేసుకునే ముందు లక్నో జిల్లా మెజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాలని పోలీసులు వాళ్లకు సూచించారు. సదరు యువతీయువకులకు ఆర్డినెన్స్‌కు సంబంధించిన కాపీలను అందజేసినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే రెండు కుటుంబాల సమ్మతితోనే ఈ పెళ్లి జరుగుతున్నట్లు సదరు యువతీయువకుల వర్గీయులు చెప్పారు. పెళ్లికి ముందు అవసరమైన అన్ని చట్టపరమైన లాంచనాలను పూర్తి చేస్తామని వాళ్లు తెలిపారు. ఇరు వర్గాల్లో ఎవరికీ మతం మారే ఉద్దేశం లేదని కూడా వాళ్లు చెప్పారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.
previous post
తన ఆరోగ్యంపై అమితాబ్ షాకింగ్ కామెంట్స్