telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా పరీక్షల విషయంలో ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం…

china found vaccine for corona virus

కరోనా పరీక్షల విషయంలో ఉత్తరాఖండ్ ఓ నిర్ణయమ్ తీసుకుంది. ఆ రాష్ట్రం నుంచి ప్రయాణం చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి కరోనా పరీక్ష జరగాల్సిందేనని ఉత్తరాఖండ్ ప్రభుత్వ నిర్ణయించింది. అయితే ఉత్తరాఖండ్‌లోని జాలీగ్రాట్ విమానాశ్రయంలో ఢిల్లీ నుంచి వచ్చే ప్రతి ప్రయాణికుడికి కరోనా పరీక్ష తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలు జారీచేసింది. ‘ఢిల్లీ నుంచి వచ్చిన వారికి కరోనా పరీక్ష నిర్వహించమని ప్రభుత్వం టీమ్‌ను నియమించింది. దీంతో ఉత్తరాఖండ్ కూడా మహరాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల సరసన నిలిచింది. ఢిల్లీ కరోనా వృద్ది కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చ’ని విమానాశ్రయం డైరెక్టర్ డీకే గౌతమ్ అన్నారు. అయితే మహరాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌లు ఢిల్లీ నుంచి వచ్చే వారికి తప్పక కరోనా పరీక్ష చేయాలన్న విషయం తెలిసిందే. అయితే ఢిల్లీలో పెరిగిపోతున్న కరోనా కారణంగా రాష్ట్రాలు ఢిల్లీ విషయంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటున్నాయని సమాచారం. ప్రస్తుతం ఢిల్లీలో 38,501 యాక్టివ్ కేసులు ఉండగా, ఉత్తరఖండ్‌లో 4,638 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రజల సంక్షేమం కోసం మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు అధికారులు.

Related posts