telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కు అనారోగ్యం

Saroj Khan

బాలీవుడ్ ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ తీవ్ర అనారోగ్యంతో ముంబై, బాంద్రాలోని గురునానక్ ఆసుపత్రిలో చేరారు. 71 ఏళ్ల సరోజ్ ఖాన్ శ్వాస కోస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో వైద్యులు ఆమెకు కరోనా పరీక్షలు చేయగా నెగిటివ్ అని రిపోర్టు వచ్చింది. వైద్యులు చికిత్స చేస్తుండటంతో సరోజ్ ఖాన్ కోలుకుంటున్నారని ఆమె కుటుంబ సభ్యులు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో సరోజ్ ఖాన్ ను డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు చెప్పారు. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2 వేల సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేశారు. దేవదాస్ సినిమాలోని ‘దోలా రే దోలా’, తేజాబ్ లో మాధురీ దీక్షిత్ నర్తించిన ‘ఏక్ దో తీన్’, జబ్ వీ మెట్ సినిమాలోని ‘యే ఇష్క్ హై’ పాటల కొరియోగ్రఫీకి సరోజ్ ఖాన్ కు జాతీయ అవార్డులు లభించాయి.

Related posts