బిగ్ బాస్ సీజన్ 3 కార్యక్రమం సక్సెస్‌ఫుల్‌గా తొమ్మిది వారాలు పూర్తి చేసుకుంది. తొమ్మిదవ వారం నామినేషన్‌లో రాహుల్ సిప్లిగంజ్, హిమజా, మహేశ్‌లు ఉండగా… రాహుల్ ఎలిమినేట్ అయినట్టుగా ఎపిసోడ్ చివరి వరకూ చూపించి చివర్లో ఫేక్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చారు నాగార్జున. ఇప్పటికే రాహుల్ ఫేక్ ఎలిమినేషన్ తో సీక్రెట్ రూంలో ఉండగా… ఎట్టకేలకు ఆదివారం జరిగిన బిగ్ బాస్ ఎలిమినేషన్ రౌండ్ లో హిమజ ఎలిమినేట్ అయ్యింది. మరోవైపు ఆదివారం ఎపిసోడ్ హీరో వరుణ్ తేజ్ ఎంట్రీతో జోష్ నిండింది. వరుణ్ తన పంచులతో హౌస్ మేట్స్ ను ఒక ఆట ఆడుకున్నాడు. ముఖ్యంగా పునర్నవితో వరుణ్ పంచులతో అదరగొట్టాడు. అయితే ఎలిమినేషన్ తో బయటకు వచ్చిన హిమజ కన్నీటి పర్యంతమైంది. బయటకి వచ్చిన తర్వాత హిమజ హౌస్ మేట్స్ గురించి మాట్లాడుతూ అందరిపై తనదైన శైలిలో గుడ్, బ్యాడ్, అగ్లీ అంటూ కామెంట్స్ చేసింది.
previous post
next post