telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆచార్య’ షూటింగ్ లో కాజల్

Kajal

ప్రస్తుతం సినీ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఆచార్య’ సినిమా ఒక్కటి. అయితే మే నెలలో విడుదల అవుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ ఖమ్మం జిల్లా ఇల్లందు సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతోంది. ఈ తాజా షెడ్యూల్ మార్చి 7 మార్చి 15 వరకు షూటింగ్ జరగనుంది. ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.  అయితే… తాజాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ మళ్ళీ మొదలైంది. ఈసారి తన ఫేవరెట్ హీరోతో షూటింగ్ లో పాల్గొంటున్నట్టు కాజల్ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. గోదావరి ఖనిలో జరిగిన షూటింగ్ లో చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. అప్పుడు అతని భుజం మీద చెయ్యివేసిన చిరంజీవి ఫోటో ఒకటి విపరీతంగా వైరల్ అయ్యింది. అలానే ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ స్టిల్స్ లోనూ చిరంజీవి మణికట్టుకు ఓ ఎర్రని రుమాలు కట్టుకునే కనిపించారు. ఆ ఫోటోను కాజల్ పోస్ట్ చేస్తూ, ‘నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తితో షూటింగ్… ఎవరో కనుక్కోండీ’ అని పేర్కొంది. ఇదిలా ఉంటే.. కాజల్ ‘ఆచార్య’తో పాటు నాగార్జున సరసన కూడ ఓ సినిమాకు కమిట్ అయ్యింది. అలానే ఆమె నటించిన ‘ముంబై సాగా’తో పాటు ‘ ‘మోసగాళ్ళు’ సినిమా కూడా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత, కథానాయకుడు మంచు విష్ణుతో పాటు కాజల్ కూ రామ్ చరణ్ శుభాకాంక్షలు తెలిపాడు.

Related posts