బాలీవుడ్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘బ్రహ్మస్త్ర’. పౌరాణిక పాత్రలతో ఈ చిత్రాన్ని మూడు భాగాలుగా రూపొందిస్తున్నారు. తొలి భాగం ‘బ్రహ్మస్త్ర’: శివ’.
తెలుగు వెర్షన్ దర్శకుడు రాజమౌళి సమర్పణలో విడుదల కానుంది. ఈ సినిమా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, కింగ్ నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రల్లో నటించారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది.
మొదటి భాగం అన్ని పనులు పూర్తి చేసుకొని.. విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో.. ‘బ్రహ్మస్త్ర’ పార్ట్-2పై దృష్టి పెట్టాడట దర్శకుడు. అందులో భాగంగానే పార్వతి పాత్రను దీపికా ఎంపిక చేశారని తెలుస్తోంది.
ఇప్పటికే మొదటి భాగం చివర్లో దీపికా పదుకోన్ అతిథి పాత్రలో కనిపిస్తారని, ఆ పాత్రే.. రెండో భాగంలోనూ కొనసాగుతుందని సమాచారం.
గతంలో అయాన్ దర్శకత్వంలో ‘ఏ జవానీ హై దివానీ’ లో కథానాయికగా నటించిన దీపికా ‘బ్రహ్మాస్త్ర’ పార్ట్ 2 కథ విని, వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.
ఇదే నిజమైతే దీపిక-రణ్‌బీర్ కలిసి నటిస్తే.. కచ్చితంగా క్రేజీ కాంబినేషన్ అవుతుంది. ప్రేమికులుగా వీరు విడిపోయిన తర్వాత.. కలిసి నటించిన తొలి చిత్రం ఇదే అవుతోంది. 2015లో వచ్చిన ‘తమాషా’ తర్వాత రణ్‌బీర్-దీపిక జంటగా నటించలేదు. 2018లో రణ్వీర్ సింగ్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి రణ్బీర్తో కలిసి కనపడలేదు దీపిక.
సుశాంత్ సోదరిపై రియా చక్రవర్తి సంచలన ఆరోపణలు