telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బిగ్ బాస్-3 : టిక్కెట్ టు ఫినాలే గెలుచుకున్న రాహుల్… టాస్క్ రద్దు

Rahul

బిగ్ బాస్ సీజ‌న్ 3 ఎపిసోడ్ 93లో టిక్కెట్ టు ఫినాలే టాస్క్ ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ప‌లు కంటెస్టెంట్స్ మ‌ధ్య ఆస‌క్తిక‌ర పోటీ సాగుతున్న క్ర‌మంలో సోమ‌వారం ఎపిసోడ్ చివ‌ర‌లో బాబా, అలీ మధ్య జ‌రిగిన ఆస‌క్తిక‌ర పోటీని చూపించారు. మంగ‌ళ‌వారం కూడా వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన పోటీని టెలికాస్ట్ చేశారు. మ‌డ్ పిట్‌లో పూల మొక్క‌లు నాటేందుకు ఇద్ద‌రు ప్ర‌య‌త్నించ‌గా, ఇది హింసాత్మ‌కంగా దారి దీయ‌డంతో టాస్క్ ర‌ద్దు చేశారు. బాబా కూల్‌గా ఆడుతున్న‌ప్ప‌టికి, అలీ త‌న బ‌ల‌ప్ర‌యోగం ప‌దే ప‌దే చేస్తుండ‌డంతో బిగ్ బాస్ ర‌ద్దు చేశారు. హింసాత్మ‌కంగా టాస్క్ ఆడొద్ద‌రి బిగ్ బాస్ హెచ్చ‌రించిన‌ప్ప‌టికి అలీ.. బాబాని త‌ల‌తో గుద్ద‌డం, చేతుల‌తో విసిరేయ‌డం వంటివి చేయ‌డం వ‌ల‌న అలీని టిక్కెట్ టు ఫినాలే నుండి తప్పిస్తున్నట్టు బిగ్ బాస్ ప్రకటించారు. అంతేకాదు ఇంకోసారి ఇలా చేయోద్ద‌ని కూడా హెచ్చ‌రించారు. అనంత‌రం బ‌జ‌ర్ మోగిన త‌ర్వాత రాహుల్‌, శ్రీముఖి గంట మోగించ‌డంతో వారిద్ద‌రు టాస్క్‌లో పాల్గొన్నారు. టాస్క్ ప్ర‌కారం ఇద్ద‌రు కంటెస్టెంట్స్ డామినోస్‌ని గార్డెన్ ఏరియాలో ఉన్న పాత్‌వేపై వ‌రుస క్ర‌మంలో పెట్టాల్సి ఉంటుంద‌ని బిగ్ తెలిపారు. ఎవ‌రు ఎక్కువ పెడితే వారు ఈ టాస్క్ విజేత‌గా నిలుస్తార‌ని బిగ్ బాస్ స్ప‌ష్టం చేశారు. ఈ టాస్క్‌లో మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న ఇచ్చిన రాహుల్ 50 శాతం పాయింట్స్ సాధించాడు.

అనంత‌రం గంట మోగించిన శ్రీముఖి, శివ‌జ్యోతి మ‌రో టాస్క్‌లో పాల్గొన్నారు. ఇందులో క్యూబ్స్‌ని పిర‌మిడ్‌ షేప్‌లో అమ‌ర్చాల్సి ఉంటుంది. వీటిని మిగ‌తా ఇంటి స‌భ్యులు పడేయోచ్చు అని బిగ్ బాస్ పేర్కొన్నారు . అయితే శివ‌జ్యోతి క్యూబ్స్‌ని పిర‌మిడ్ షేప్‌లో కాకుండా బాక్స్ రూపంలో పేర్చ‌డంతో శ్రీముఖిని విజేత‌గా ప్ర‌క‌టించారు బిగ్ బాస్. అయితే అంద‌రి క‌న్నా రాహుల్‌కి ఎక్కువ పాయింట్స్ రావ‌డంతో రాహుల్‌ని టికెట్ టు ఫినాలే టాస్క్ విజేతగా ప్ర‌క‌టించాడు బిగ్ బాస్. ఇక మిగిలిన వరుణ్, అలీ, శ్రీముఖి, బాబా, శ్రీముఖి, శివజ్యోతిలు ఈవారం నామినేషన్స్‌లో నిలిచారు. ఐదుగురిలో ఒక‌రు ఈ వారం బిగ్ బాస్ హౌజ్ నుండి బ‌య‌టకి వెళ్ళ‌నుండగా, ఫినాలేలో ఐదుగురు ఇంటి స‌భ్యులు పోటీలో పాల్గొన‌నున్నారు. అయితే డైరెక్ట్‌గా ఫినాలేకి వెళ్ల‌డంపై ఆనందం వ్య‌క్తం చేసిన రాహుల్ .. ‘మమ్మీ టాస్క్‌లు బాగా ఆడు అని నువ్ చెప్పావ్.. నేను నీకు మాట ఇచ్చా చేస్తా అని.. ఆ మాటను నేను ఫైనల్‌కి చేరడం ద్వారా నెరవేర్చా’ అని అన్నాడు.

Related posts