telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అమృత, ప్రణయ్ లవ్ స్టోరీ సినిమాగా… నటుడు బాలాదిత్య

baladitya

ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మారుతీరావు ఆదివారం నాడు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం సంచలనంగా మారింది.మారుతీరావు ఆత్మహత్యతో ఒక్కసారిగా అమృత, ప్రణయ్‌ ప్రేమకథ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అవుతోంది. మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన అమృత ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో తన కులం వాడు కాదన్న కారణంతో పాటు ఆస్తి, అంతస్తులు సరితూగకపోవడంతో ప్రణయ్‌ని హత్య చేయించారు మారుతీరావు. నిండు గర్భిణిగా ఉన్న కూతురు అమృత కళ్ల ముందే అత్యంత దారుణంగా కిరాయి హంతకులు ప్రణయ్‌ని నరికిచంపారు. అమృత, ప్రణయ్‌‌ ప్రేమకథపై రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ విడుదలకు సిద్ధమైంది. అమృత, ప్రణయ్‌‌ ప్రేమకథ స్పూర్తితో నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.

ఈ చిత్రం గురించి నటుడు బాలాదిత్య పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు. సెకండాఫ్‌లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు తమ పాత్రల్ని ఎంతో హార్ట్ టచ్చింగ్‌ అండ్ ఎమోషనల్‌గా తీర్చిదిద్దారన్నారు. తమ పాత్రల నిడివి తక్కువే అయినా సినిమాలో హైలైట్‌గా ఉంటుందంటున్నారు. వాస్తవిక కథలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రణయ్ పాత్ర చేయడం కోసం చాలా రీసెర్చ్ చేశానన్నారు బాలాదిత్య. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు నటుడు బాలాదిత్య.

Related posts