telugu navyamedia
సినిమా వార్తలు

“ఒక్కరే మహానటి కాదు” జయసుధ కామెంట్స్… హీరోలపై టియస్సార్ సెటైర్లు

TSR

ఈ నెల 17న టి. సుబ్బరామిరెడ్డి (టీయస్సార్‌) పుట్టినరోజు సందర్భంగా విశాఖలో నిర్వహించే కార్యక్రమంలో ఈ పురస్కారం ప్రదానం చేయనున్నారు. ఆ వివరాలు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీయస్సార్‌ తెలిపారు. ఈ సందర్భంగా టియస్సార్ మాట్లాడుతూ “మనమంతా గర్వించదగ్గ నటి జయసుధ. సుమారు 300 చిత్రాలు చేసింది. ఆమెకు నటించడం రాదు… పాత్రలోనూ లీనమైపోతుంది. ఎప్పుడూ చిరునవ్వుతో ఉంటుంది. తన గురించి చెప్పుకుంటూ పోతే మాటలు చాలవు. నటనలో నాట్యం చూపించే కళాకారిణి జయసుధ. అందుకని, తనకు ‘అభినయ మయూరి’ పురస్కారాన్ని అందజేస్తున్నాం” అని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, ఏఎన్నార్ లతో ప్రజెంట్ జనరేషన్ హీరోలని పోల్చుతూ సుబ్బిరామిరెడ్డి విమర్శలు చేశారు. “దేవుడు సృష్టించిన కళలలో సినిమా చాలా గొప్పది. ఈ విషయం చాలా మందికి తెలియక సినిమా వాళ్లని చులకనగా చూస్తుంటారు. అది సరైంది కాదు. గతంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ అవార్డు వచ్చినా ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి హీరోలు హాజరై తీసుకుని వెళ్లేవారు. కానీ ప్రజెంట్ జనరేషన్ హీరోలు సినిమా కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. 17న జరగబోయే ఈవెంట్ కు సినీ రాజకీయ ప్రముఖులు హాజరు కాబోతున్నారు” అని సుబ్బిరామిరెడ్డి తెలిపారు.

జమున మాట్లాడుతూ “జయసుధ “పండంటి కాపురం”లో నా కూతురిగా నటించింది. తర్వాత మాతో సమానంగా నటించి ‘మహానటి’ అనిపించుకుంది. చక్కటి పాత్రలు లభించడం తన అదృష్టం. కళాబంధు టీయస్సార్‌గారు ప్రజాసేవకుడు, నాయకుడు” అన్నారు.

జయసుధ మాట్లాడుతూ “టీయస్సార్‌గారు ఎప్పుడూ ఇలాగే అవార్డు ఫంక్షన్లు చేస్తుండాలి. ముఖ్యంగా పాత వాళ్లను మర్చిపోకుండా పిలిచి గౌరవిస్తుండటం బావుంది. నాకు అవార్డు రావడం సంతోషంగా ఉంది. మహానటి అంటే మనం ఒక్కరే అనుకుంటున్నాం. అందరూ మహానటులే. మహానటి అయితే తప్ప ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు కొనసాగలేం’”అన్నారు.

మురళీమోహన్‌ మాట్లాడుతూ “ఈ మధ్య కాలంలో ప్రభుత్వం తరపున అవార్డులు ఇచ్చే సంస్కృతి పోయింది. గత ప్రభుత్వం వారు గానీ… ఈ ప్రభుత్వం వారు గానీ… నంది అవార్డులను పట్టించుకోవడం లేదు’’ అని నటులు మురళీమోహన్‌ అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం ఇచ్చే అవార్డు అంటే చాలా గొప్పగా చెప్పుకుంటాం. అటువంటి నంది అవార్డులు ఏడెనిమిది సంవత్సరాలుగా ఎవరికీ ఇవ్వడం లేదు. దయచేసి ఇప్పటి ప్రభుత్వమైనా దాన్ని గుర్తించి… గత నాలుగు సంవత్సరాలుగా ఇవ్వవలసిన పాత అవార్డులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అన్నారు.

Related posts