telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పుష్ప టీం మరో అనూహ్య నిర్ణయం.. పది భాషల్లో రిలీజ్ కు స్కెచ్!

Pushpa

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పుష్పా. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని తెగ కష్టపడిపోతున్నారు. ఈ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మెస్తోంది. ఇందులో లక్కీ బ్యూటీ రష్మికా మందన్న బన్నీ సరసన నటిస్తోంది. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాకు విలన్ దొరకలేదు. ఈ సినిమాలో విలన్ కోసం చిత్రం బృందం గాలింపులు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇందులో విలన్ పాత్రకు ముందుగా తమిళ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారట, అతడు అందుబాటులో లేకపోవడంతో అతడిపై ఆశలు వదిలేశారు. దాని తరువాత విలన్ కోసం జల్లెడ వేస్తున్న సుకుమార్‌ ఇటీవల ఆర్యాను సంప్రదించాడట. ఆర్యా, అల్లు అర్జున్ ఇద్దరు కలిసి ఇంతకుముందు వరుడు సినిమాలో కనపించారు. పుష్ప సినిమాపై అంచనాలు ఓ రెంజ్‌లో ఉన్నాయి. పుష్ప సినిమాను పాన్‌ ఇండియా వైడ్‌గా రిలీజ్‌ చేద్దామని ప్లాన్‌ చేశారు. తెలుగుతో పాటు మరో 4 భాషల్లో అవుతోంది. అయితే.. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా రిలీజ్‌ విషయంలో అనుహ్య నిర్ణయం తీసుకున్నారట. ఈ సినిమాను ఏకంగా 10 భాషల్లో రిలీజ్‌ చేయడానికి ఫిక్స్‌ అయ్యారట. ఈ నిర్ణయంతో పుష్ప సినిమా భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.

Related posts