దివంగత నటి శ్రీదేవి వారసురాలిగా వెండితెరకు పరిచయమైన జాన్వీ కపూర్ మొదటి చిత్రం “ధడక్”తోనే విజయాన్ని అందుకొని తన సత్తా చాటింది. ఆ తరువాత హీరోయిన్ గా ఆమెకి వరుస అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఈమె “తక్త్”, “రూహ్ అఫ్జా”, “దోస్తానా-2” చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే జాన్వీ నటించిన “గుంజన్‌సక్సేనా : ది కార్గిల్ గర్ల్” చిత్రం విడుదలై ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంది. అయితే… జూనియర్ శ్రీదేవి అంటూ పేరు దక్కించుకున్న జాన్వీ కపూర్ ఇటీవల ముంబయిలోని ఖరీదైన ఏరియా జుహులో ఏకంగా 39 కోట్లు పెట్టి ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసిందట. జుహూలో కేవలం స్టార్స్‌కు మాత్రమే ఇళ్లు ఉంటాయి. అలాంటి ఖరీదైన ప్రాంతంలో జాన్వీ అప్పుడే ఇల్లు కొనుక్కో గలిగింది అంటే ఆమె ఆదాయం ఎంతలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. సినిమాల ద్వారానే కాకుండా బ్రాండ్ అంబాసిడర్‌గా ఇంకా సోషల్ మీడియా ప్రయోటింగ్ ద్వారా కూడా జాన్వీ కపూర్ ఆదాయం దక్కించుకుంటుంది. దానికి తోడు తండ్రి కూడా గిఫ్ట్‌గా ఆమెకు కొంత మొత్తం డబ్బు ఇచ్చాడేమో అందుకే అంత భారీగా ఖర్చు పెట్టి ఇళ్లు తీసుకుని ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
previous post