బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రియాల్టీ షో మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ ప్రారంభం కాబోతుంది. ఈరోజు సాయంంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానల్‌తోపాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
ఇక గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్క్‌లతో బిగ్‌బాస్ సీజన్ 6కు అక్కినేని నాగార్జున హోస్ట్ గా వచ్చేస్తున్నాడు.
ఇక ఆరో సీజన్‌లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఇంట్లోకి ప్రవేశించనున్నట్లుగా తెలుస్తోంది. అందులో 9 మంది అబ్బాయిలు ఉండగా.. 10 మంది అమ్మాయిలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే షోకు సంబంధించి విడుదలైన ప్రోమోస్ ఆసక్తిని పెంచుతున్నాయి. తాజాగా బిగ్‌బాస్6కు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు మేకర్స్.
అందులో కంటెస్టెంట్స్‌ని చూపించి చూపించనట్టుగా చూపించి ఆసక్తి రేకెత్తించారు. వాళ్ల ముఖాలను సరిగా చూపించలేదు కానా..వాయిస్‌ని బట్టి కొంతమందిని గుర్తించొచ్చు.
ముఖ్యంగా చలాకీ చంటి, సింగర్ రేవంత్ వాయిస్‌లు స్పష్టంగా వినిపించాయి. అలాగే హౌస్‌లోకి వెళ్తున్న జోడీని కూడా చూపించారు. ఇక ఈసారి కూడా హుస్‌లో అమ్మాయిల హవా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు హోస్ట్ సాగార్జున వారిని ఓ ఆట ఆడేసుకున్నాడు.
ఓ కంటెస్టెంట్.. మిమ్మల్ని మాస్టారూ అని పిలవొచ్చా అని అడగడంతో.. ‘మా..కి, స్టార్..కి మధ్య గ్యాప్ ఇచ్చి మా.. స్టార్ అని పిలువు అని నాగ్ అనడం అందరిని ఆకట్టుకుటుంది. మొత్తానికి బిగ్‌బాస్ షో అయితే అదిరింది. గత సీజన్స్‌తో పోలిసే ఈ సారి జోష్ ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తోంది.
కంటెస్టెంట్స్ వీరే
జబర్ధస్థ్ ఫైమా.. చలాకీ చంటి, సుదీప (నువ్వు నాకు నచ్చావ్ ఫేమ్ పింకీ), అభినయ శ్రీ, యాంకర్ ఆరోహి, కీర్తి భట్, వాసంతి కృష్ణన్, యాంకర్ నేహా చౌదరీ, గలాటా గీతు, ఆర్జే సూర్య, సింగర్ రేవంత్, రోహిత్ మెరీనా(కపూల్స్), హీరో అర్జున్ కళ్యాణ్, బాలాదిత్య, మోడల్ రాజశేఖర్, శ్రీహాన్, యూట్యూబర్ ఆదిరెడ్డి, ఇనయ సుల్తానా, నటి శ్రీ సత్య ..