telugu navyamedia
సినిమా వార్తలు

‘పాగల్’ హీరోకు క‌రోనా..

సినీ ప‌రిశ్ర‌మ‌లో క‌రోనా క‌ల‌క‌లం సృష్టిస్తుంది. కొన్ని రోజులుగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ స‌హా ప‌లు సినీ ప‌రిశ్ర‌మ‌లోని సెల‌బ్రిటీలు కోవిడ్ బారిన ప‌డుతున్నారు.

తాజాగా.. టాలీవుడ్‌ యంగ్ హీరో విశ్వక్‌సేన్‌కు కరోనా సోకింది. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు విశ్వక్ సేన్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించాడు.

 ‘అందరికి హాయ్.. నాకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఐసోలేషన్ లోకి వెళ్ళాను.  వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం చికిత్స తీసుకొంటున్నాను. 

వ్యాక్సిన్‌ వేయించుకున్నప్పటికీ కరోనా బారినపడటం దురదృష్టకరం. ఇది చాలా వేగంగా వ్యాప్తి చెందుతోంది. దయచేసి అందరూ మాస్కు ధరించండి, జాగ్రత్తగా ఉండండి. మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’ అని విశ్వక్ ట్విటర్‌లో పోస్ట్‌ పెట్టారు.

Actor-writer Vishwak Sen plays a tough cop in a new thriller HIT - The Hindu

మరోవైపు విశ్వక్‌కు పాజిటివ్‌ అని తెలియడంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘‘గెట్‌ వెల్‌ సూన్‌ అన్నా’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ప్రస్తుతం విశ్వక్ సేన్ ‘ఓ మై కడవులే’ తెలుగు రీమేక్‌ ‘ఓరి దేవుడా’, ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ సినిమాలు చేస్తున్నాడు.

Image

Related posts