telugu navyamedia
సినిమా వార్తలు

అందుకే బ్లడ్‌ బ్యాంక్ పెట్టాం..త్వరలో ఆసుపత్రి నిర్మిస్తా..

మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ రాజ్ భవన్ కు వెళ్లారు. చిరంజీవి బ్లడ్‌బ్యాంక్‌కు 50కంటే ఎక్కువ సార్లు రక్తదానం చేసిన వారికిచిరు భద్రత’ లైఫ్‌ఇన్సూరెన్స్ కార్డులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

రక్తదాతలకు గవర్నర్‌ తమిళిసై చేతుల మీదుగా లైఫ్‌ఇన్సూరెన్స్ కార్డుల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్​తో పాటు చిరంజీవి పాల్గొన్నారు.

అనంతరం చిరంజీవి మాట్లాడుతూ.. ఇప్పటిదాకా తాము 9.30 లక్షల యూనిట్ల రక్తాన్ని సేకరించామని తెలిపారు. ఇందులో 70 శాతం రక్తం పేదలకు అందించామని చెప్పారు. మిగతా ప్రైవేటు ఆస్పత్రులకు అందజేశామని వివరించారు.

1998లో ప్రమాదంలో గాయపడ్డ వారు సమయానికి రక్తం ఎంతో మంది మరణించారు. ఆ ఘటనలు నన్ను బాధించాయి. అలాంటి ఘటనలు ఇకముందు జరగకూడదనే ఉద్ధేశంతోనే 24 సంవత్సరాల క్రితం బ్లడ్‌ బ్యాంక్‌ను స్థాపించాను అని అన్నారు.

అభిమానులు బ్లడ్‌ డొనేట్‌ చేస్తూ దీనిని ఒక ప్రవాహంలా ముందుకు తీసుకువెళ్తున్నారు.తరచూ 2-3వేల మంది రక్తదానం చేస్తున్నారన్నారు. అలాంటి వారికి ఏదైనా భద్రత ఇవ్వాలనే ఉద్దేశంతో ‘చిరు భద్రత’ పేరుతో ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. త్వరలో ఆస్పత్రి కట్టనున్నట్లు చిరంజీవి చెప్పారు.

యాభై అరవై సార్లు రక్తం దానం చేసిన వారికి చిరు భద్రతగా లైప్‌ ఇన్సూరెన్స్‌ కార్డులు అందిస్తున్నామ‌ని అన్నారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్‌ తమిళి సై సౌందర్‌ రాజన్‌ గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఆనందంగా ఉందని అన్నారు.

నేను చేస్తున్న సేవా కార్యక్రమాలకు గవర్నర్‌ గారి ప్రోత్సాహకం ఎంతో ఉత్సహాన్ని ఇస్తుందని, ఆమె ఎన్నో సార్లు ట్వీట్ల ద్వారా ఎంకరేజ్‌ చేశారు’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.

తెలుగు రాష్ట్రాల్లో రక్తం దొరకడం లేదన్న సమస్య ఇప్పుడు చాలా తక్కువగా ఉందన్నారు. రక్తదానం చేసేవారికి ఈ సందర్భంగా చిరంజీవి ధన్యవాదాలు తెలిపారు.

Related posts