telugu navyamedia
సినిమా వార్తలు

హైదరాబాద్ లో గిరీష్ కర్నాడ్ చిత్రోత్సవం

Girish

భారతదేశం గర్వించతగ్గ నటుడు, రచయిత, దర్శకుడు గిరీష్ కర్నాడ్. ఆయన స్మ్రుతికి నివాళిగా తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సోమవారం నుంచి శుక్రవారం వరకు గిరీష్ కర్నాడ్ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తున్నది. బహు భాషా నటుడు, ప్రయోక్త గిరీష్ తన 81ఏట జూన్ 10న మరణించారు. రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ లో జూన్ 24 సోమవారం నుండి 28వ తేది శుక్రవారం వరకు గిరీష్ కర్నాడ్ నటించినవి, దర్శకత్వం వహించిన వాటి నుంచి 10 సినిమాలను ఎంపిక చేశారు. నగర సినిమా ప్రియులందరి కోసం ఉచితంగా వీటిని ఏర్పాటు చేశారు.

Karnad

భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ మాట్లాడుతూ… “భారత దేశంలో అత్యున్నత పురస్కారాలైన పద్శశ్రీ, పద్శ భూషణ్, జ్ఞానపీఠ్ అవార్డులు అందుకున్న గిరీష్ కర్నాడ్ తన రచనలతో సాహిత్యరంగంలో, నటనతో సినిమారంగంలో చెరగని ముద్ర వేశారు” అని అన్నారు. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన గిరీష్ కర్నాడ్ కి నివాళిగా ఈ ఫిలిం ఫెస్టివల్ ను నిర్వహిస్తున్నామని, ఆయన తీసిన సినిమాల్లోంచి ఉత్తమమైన 10 సినిమాలను ఎంపిక చేసి ప్రతిరోజు రెండు సినిమాల (మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6 గంటలకు) చొప్పున 5 రోజులు ప్రదర్శిస్తున్నామని తెలిపారు. సినిమాను ఒక కళగా భావించి రవీంద్ర భారతిలోని పైడి జైరాజ్ ప్రివ్యూ థియేటర్ వేదికగా అనేక సినీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొంటూ, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహిస్తున్న ఈ ఫిలిం ఫెస్టివల్ కి గిరీష్ కర్నాడ్ అభిమానులు, సినీప్రియులు విచ్చేసి సినిమాలను వీక్షించి, ఫిలిం ఫెస్టివల్ ను విజయవంతం చేయాలని కోరారు.

గిరీష్ కర్నాడ్ ప్రదర్శన చిత్రాలు
సోమవారం (24.06.2019)
మ. 2 గంటలకు – సంస్కార (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – వంశవృక్ష (కన్నడ)*

మంగళవారం (25.06.2019)
మ. 2 గంటలకు – కాడు (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – మంథన్ (హిందీ)

బుధవారం (26.06.2019)
మ. 2 గంటలకు – స్వామి (హిందీ)
సా. గం. 6.30 ని.లకు – ఉంబర్త (మరాఠి)

గురువారం (27.06.2019)
మ. 2 గంటలకు – ఆనందభైరవి (తెలుగు)
సా. గం. 6.30 ని.లకు – సూత్రధార్ (హిందీ)

శుక్రవారం (28.06.2019)
మ. 2 గంటలకు – నాగమండల (కన్నడ)
సా. గం. 6.30 ని.లకు – ఉత్సవ్ (హిందీ)

Related posts