telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సల్మాన్ తో కుస్తీ పడుతున్న స్టార్ హీరో

Salman-and-Sudeep

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, కన్నడ స్టార్ హీరో సుదీప్ ఇద్ద‌రు కుస్తీ పడుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స‌ల్మాన్ ఖాన్, సానాక్షి సిన్హా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో “ద‌బాంగ్-3” చిత్రం తెర‌కెక్కుతుంది. ఇందులో క‌న్నడ హీరో సుదీప్ ప్ర‌తినాయ‌కుడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. డిసెంబ‌ర్ 20న ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అయితే “దబాంగ్-3” చిత్రంతో స‌ల్మాన్, సుదీప్ మ‌ధ్య మంచి బంధం ఏర్ప‌డ‌గా, ఖాళీ సమ‌యంలో వీరిద్ద‌రు స‌ర‌దాగా ఇలా ఫోటో దిగారు. ఆ ఫోటోని షేర్ చేసిన సుదీప్ “మీ జీవితంలో నాకు చోటు ఇచ్చినందుకు ధ‌న్య‌వాదాలు స‌ల్మాన్ స‌ర్. దీనిని గౌరవంగా, ఆశీర్వాదంగా భావిస్తున్నాను” అని తెలిపారు. సుదీప్ “సైరా”లో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర పోషించారు. ఇక ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో “ప‌హిల్వాన్” అనే క‌న్న‌డ చిత్రంలో మ‌ల్ల‌యోధుడి పాత్ర పోషించాడు. ఈ చిత్రం తెలుగులో “ప‌హిల్వాన్” అనే టైటిల్ తో విడుద‌ల కానుంది. ఆ మ‌ధ్య మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేయించారు. తాజాగా చిత్ర ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సినిమా ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. సెప్టెంబ‌ర్ 12న చిత్రం విడుద‌ల కానుంది. సుదీప్ తెలుగులో ఈగ‌, బాహుబ‌లి వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే.

Related posts