telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

“ట్విట్టర్” పై తొలి కేసు నమోదు…

twitter logo

“ట్విట్టర్” పై తొలి కేసు నమోదు అయ్యింది. తాజాగా జూన్ 5 వ తేదీన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో జరిగిన ఓ సంఘటన కు సంబంధించి “ట్విట్టర్” పై కేసు నమోదు చేసారు. “ట్విట్టర్” తో పాటు, కొంత మంది పాత్రికేయులు, కాంగ్రెస్ నాయకుల పై కూడా కేసు నమోదు చేసారు. భారత్ లో “ట్విట్టర్” మేనేజింగ్ డైరెక్టర్ మనీష్ మహేశ్వరి ఉత్తర ప్రదేశ్ పోలీసులు లీగల్ నోటీసు జారీ చేసారు. ఓ వారంలోగా ఢిల్లీ సరిహద్దుల్లో ఉన్న పోలీసు స్టేషన్ కు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని అందులో స్పష్టం చేసింది. అయితే జనవరిలో నే తొలిసారిగా “ట్విట్టర్” కు సమన్లు జారీ చేసారు. కొత్త ఐ.టి నిబంధనలను తొలుత “ట్విట్టర్” నిరాకరించింది. అప్పటి నుండి ట్విట్టర్ కు కేంద్రానికి మధ్య వాగ్వాదం జరుగుతూనే ఉంది.

Related posts