telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

నేడు నారా లోకేశ్ పెళ్లిరోజు..హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి అంటూ ట్వీట్

Brahmani election campaign in mangalagiri

టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ పెళ్లిరోజు సందర్భంగా ఈ రోజు ట్విట్టర్ లో స్పందించారు. నారా బ్రాహ్మణితో తన దాంపత్యజీవితానికి 12 ఏళ్లు అంటూ ట్వీట్ చేశారు. “12 సంవత్సరాలు, 144 నెలలు, 4,383 రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు, 37,86,91,200 సెకన్లు. ప్రతి క్షణం నీ ప్రేమలోనే అంటూ ట్విటర్ లో పేర్కొన్నారు.

ఇన్నేళ్ల కాలంలో నిన్ను నేను ప్రేమించకుండా ఉన్న క్షణం అంటూ లేదు. హ్యాపీ యానివర్సరీ బ్రాహ్మణి” అంటూ తన భావుకతను ప్రదర్శించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు తనయుడు లోకేశ్, నందమూరి బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిల వివాహం 2007 ఆగస్టు 26న జరిగిన సంగతి తెలిసిందే.

Related posts