telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె..

*పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా.. భారతీయుల గుండె..
*జాతీయ జెండా మన స్వాతంత్రానికి, ఆత్మగౌరవానికి, అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక
*స్వాతంత్ర‌ పోరాటంలో వాదనలు వేరైనా గమ్యం మాత్రం స్వాతంత్ర్యమే..
*ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోంది

స్వాతంత్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా..పింగళి వెంకయ్య రూపొందించిన జెండా ..భారతీయుల గుండె అని సీఎం జ‌గ‌న్ అన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి, భారతీయతకు, నిబద్ధతకు మన జెండా ప్రతీకని తెలిపారు.

స్వాతంత్ర్య‌ దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో సీఎం జాతీయ పతాకాన్నిఆవిష్కరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడారు.. మనవతా విలువకు ఉదాహరణ మన స్వాతంత్ర్య పోరాటమని ఆయన చెప్పారు.

ఈ పోరాటంలో వాదనలు వేరైనా గమ్యం మాత్రం స్వాతంత్ర్యమే అని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన అల్లూరి త్యాగాన్ని స్మరించుకోవాలన్నారు.

75 ఏళ్లలో దేశం తిరుగులేని విజయాలు సాధించిందని, ప్రపంచంతో పోటీ పడి మరీ ప్రగతి సాధిస్తోందని తెలిపారు. స్వాతంత్ర్యం నాటికి 18 శాతం సాగు భూమికి నీరందించారన్నారు. ఇప్పుడు 49 శాతం వ్యవసాయ భూమికి నీటి సదుపాయం ఉందని అన్నారు.

ప్రపంచ ఫార్మా రంగంలో దేశం మూడో స్థానంలో ఉందన్నారు. దేశం దిగుమతుల నుంచి ఎగుమతుల స్థాయికి వేగంగా అడుగులు వేసిందన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొందని అన్నారు. ప్రపంచదేశాలతో భారత్ పోటీ పడుతోందన్నారు.

అలాగే ఏపీ ప్రభుత్వం సైతం పలు రంగాల్లో దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీ పడి ఉత్పాదకత సాధిస్తుందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ అన్ని వర్గాల శ్రేయస్సుకు పాటుపడటం తమ ప్రభుత్వ ప్రత్యేకత అన్నారు.

మూడేళ్ల పాలనతో ప్ర‌భుత్వం అందిస్తున్నసంక్షేమ పథనాల చక్కగా సాగుతున్నాయని.. అయినా విపక్షాలు.. కొన్ని వర్గాలు ఆరోపణలు చేయడం బాధాకరమన్నారు.

రైతు సంక్షేమానికే లక్షా 27వేల కోట్లు ఖర్చు చేయడం ద్వారా అన్నం పెట్టే రైతన్నకు భరోసాగా నిలిచామన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటివద్దకే ఫించన్ అందించడం తమ పనితీరుకు నిదర్శనమన్నారు. 3ఏళ్లలో 40వేల కొత్త ఉద్యోగాలు ఇచ్చామన్నారు. అమ్మఒడితో పేద కుటుంబాల విద్యార్థుల చదువులకు భరోసాగా నిలిచామన్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం రిజర్వేషన్లతో సామాజిన న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలు, ఆత్మగౌరవానికి అన్ని ప్రాంతాల సమతుల్యత అవసరమని స్పష్టం చేశారు

పేద వర్గాల అభ్యున్నతి కోసం.. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. పేత విద్యార్థులకు ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టామన్నారు. విద్యా రంగంలో సమూల మార్పుల కోసం అనేక పథకాలు ప్రవేశ పెడుతున్నామన్నారు. అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, నాడు నేడు లాంటి ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చట్టామన్నారు.

ఆరోగ్య రంగపై ఫోకస్ చేస్తూ.. ఆరోగ్య శ్రీ పరిధిని పెంచామని గుర్తు చేశారు. ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్న వారందరికీ ఆరోగ్య శ్రీ కింద వైద్యం అందిస్తున్నామన్నారు. వేయి రూపాయిలు దాటి అయ్యే ప్రతి చికిత్సను ఉచితంగా అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

Related posts