మాచర్లలో నిన్న జరిగిన ఘటనపై టీడీపీ అధినేతనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికైనా వెళ్తామని, మీ గుండెల్లో నిద్రపోతామని రౌడీయిజం చేస్తే అదే మీకు చివరి రోజు. ఇలాంటి రౌడీలను చాలామందిని చూశామని వైసీపీనీ హెచ్చరించారు.
మాచర్లకు బోండా ఉమ, బుద్ధా వెంకన్న రావాల్సిన అవసరం ఏంటి? అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారన్న ప్రశ్నపై బాబు స్పందిస్తూ మాచర్లకు ఎవరూ పోకూడదా? ఇది (మాచర్ల) పాకిస్థానా? వీసా కావాలా? మీ తాత జాగీరా? అంటూ విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో ఏ ఊరికి ఎవరూ పోకూడదా? తెలుగుదేశం పార్టీ ఉండకూడదా? అంటూ మండిపడ్డారు.