telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు రాజకీయ

వివేకా హత్య కేసు : సాక్ష్యాలు తారుమారుచేసిన ముగ్గురిని కోర్టులో హాజరు పరిచిన పోలీసులు..

SIT Investigation YS viveka Murder
వివేకా హత్య కేసులో  సాక్ష్యాలు తారుమారు చేసిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వివేకా అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, వివేకానందరెడ్డి  వంట మనిషి కుమారుడు ప్రకాశ్ ను అరెస్టు చేసినట్టు ఈ మేరకు పులివెందుల పోలీసులు నోటీసులు జారీ చేశారు. వివేకా హత్య తర్వాత సాక్ష్యాలు తారుమారు చేసినట్టు పోలీసులు గుర్తించారు. 
బాత్రూమ్ లో ఉన్న వివేకా మృతదేహాన్ని బెడ్ రూమ్ కి తరలించారని, బెడ్రూమ్ లో ఉన్న రక్తపు ఆనవాళ్లు చెరిపేసి సాక్ష్యాధారాలు తారుమారు చేశారని, ఆ సమయంలో ఎర్రగంగిరెడ్డి అక్కడే ఉన్నట్లు పోలిసులు భావించారు. వివేకా రాసిన లేఖ ఉదయం సమయంలోనే దొరికినా, సాయంత్రం దాకా ఇవ్వలేదని పీఏ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టు ఎదుట పోలీసులు హాజరుపరిచారు.

Related posts