పోలవరంలో రికార్డు స్థాయిలో పనులు జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఓర్వలేక పోతున్నాడని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఈ రోజు ఉదయం విజయవాడలో మీడియాతో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు కోసం ఇప్పటివరకూ రూ. 10 వేల కోట్లు ఖర్చుపెడితే, రూ. 25 వేల కోట్ల అవినీతి జరిగిందని జగన్ ఆరోపించడం ఏంటని ప్రశ్నించారు.
వైఎస్ జగన్ కు ముఖ్యమంత్రి కూర్చునే కుర్చీ తప్ప, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కనిపించడం లేదని మండిపడ్డారు. మంచిని అంగీకరించలేని మానసిక వ్యాధి జగన్ ను పీడిస్తోందని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేసీఆర్ డైరెక్షన్ లో సీఎం చంద్రబాబుపై కుట్రలు పన్నుతున్నారని దేవినేని ఆరోపించారు.