telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఎఫ్-2” ట్రైలర్… నిజంగానే పండక్కి గట్టిగా నవ్వించేటట్టున్నారు

F2

దిల్ రాజు నిర్మాతగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ సినిమా రూపొందుతోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ కథానాయకులుగా చేస్తోన్న ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా… వరుణ్ తేజ్ జోడిగా మెహ్రీన్ నటిస్తోన్న ఈ సినిమా, నాన్ స్టాప్ నవ్వులతో కొనసాగుతుందని చెబుతున్నారు. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకుండా సినిమాను తెరకెక్కించారట. ఇక ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లకు మంచి స్పందన వచ్చింది. ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల చేశారు చిత్రబృందం. “ఎఫ్-2” టీజర్ కు, అందులో వెంకీ, వరుణ్ చేసిన సందడికి అద్భుతమైన స్పందన లభించింది. యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో ట్రెండ్ అయ్యింది ఈ టీజర్. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ ను విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లో “చివరిగా నవ్వుకుని తాళి కట్టు నాయనా… అట్టా ఏడిపించకపోతే దాని కడుపున కాయ కాయించొచ్చుగా… 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలెక్కడ కాస్తయ్… నీ తలకాయ్…” అంటూ వచ్చే డైలాగులు బాగున్నాయి. నిజంగానే పండక్కి బాగా గట్టిగా నవ్వించేటట్టున్నారు “ఎఫ్-2” టీం. ప్రస్తుతం ఈ ట్రైలర్ ను 2 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. మరి మీరు కూడా ట్రైలర్ ఓ లుక్కేయండి. జనవరి 12న సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts