telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

ముగ్గురు కూతుళ్లను హత్య చేసి.. ఆత్మహత్యకు పాల్పడ్డ తండ్రి

New couples attack SR Nagar

తన ముగ్గురు కూతుళ్లను ఓ తండ్రి హత్య చేసి అనంతరం తాను ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ అమానుష సంఘటన గుజరాత్‌ రాష్ట్రంలోని జునాగఢ్‌ జిల్లా ఖంబాలియా గ్రామంలో చోటుచేసుకుంది. వరుసగా నాలుగోసారి కూడా ఆడపిల్లే పుట్టిందన్న ఆగ్రహంతో తండ్రి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లుగా పోలీసులు వెల్లడించారు. తండ్రి సోలంకి(30) తన ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి హత్య చేశాడు. ఆ సమయంలో భార్య కాన్పు నిమిత్తం తన పుట్టింట్లో ఉంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts