telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కుపై ఎందుకు మాట్లాడకూడదు…మరోసారి కేంద్రంపై కేటీఆర్ ఫైర్ ‌

కేంద్రంపై మరోసారి మంత్రి కేటీఆర్‌ ఫైర్‌ అయ్యారు. భవిష్యత్తులో రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ప్రైవేట్‌పరం చేస్తారేమోనని కేటీఆర్‌ కేంద్రానికి చురకలు అంటించారు. విశాఖ ఉక్కుపై మేం ఎందుకు మాట్లాడకూడదని.. విశాఖ ఉక్కు ఈ దేశంలో లేదా? అని మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. వారికి కష్టం వస్తే మేం మాట్లాడితే తప్పా అని ఫైర్‌ అయ్యారు. మాకు కష్టం వస్తే ఎవరు మద్దతిస్తారు… సింగరేణిని ఎట్టిపరిస్థితుల్లో ప్రైవేట్‌పరం చేయనివ్వబోమని కేటీఆర్ స్పష్టం చేశారు. బీజేపీలో ప‌ని చేసే విద్యార్థులు రాష్ర్ట యూనివ‌ర్సిటీల‌లో చ‌దువుత‌లేరు.. వారంతా వాట్సాప్ యూనివ‌ర్సిటీల‌లో చ‌దువుతున్నార‌ని కేటీఆర్ ఎద్దెవా చేశారు. అన్ని యూనివ‌ర్సిటీల‌కు వీసీల‌ను నియ‌మించాం. రాజ‌కీయాల‌కు తావు లేకుండా ఉన్న‌త విద్యావంతుల‌ను వీసీలుగా నియ‌మించి నిజాయితీ చాటుకున్నాం. హెచ్‌సీయూ వీసీ నియామ‌కంలో రాజ‌కీయం చేసింది బీజేపీ కాదా? అని ప్ర‌శ్నించారు. బీజేపీ రాజ‌కీయాల వ‌ల్ల రోహిత్ వేముల ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు అని తెలిపారు. విద్యా రంగానికి సీఎం కేసీఆర్ అండ‌గా నిల‌బ‌డ్డారు. అంగ‌న్‌వాడీ పిల్ల‌ల‌కు బాలామృతం వంటి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో చ‌దివే విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్న భోజ‌నం స‌న్న‌బియ్యంతో పెడుతున్నామ‌ని చెప్పారు. గురుకుల పాఠ‌శాల‌ల్లో నాణ్య‌మైన విద్య‌ను అందిస్తున్నామ‌ని తెలిపారు. గురుకుల విద్యార్థులు నీట్‌, ఐఐటీ, ఐఐఎంలో సీట్లు సాధిస్తున్నారు. ఇదంతా టీఆర్ఎస్ ప్ర‌భుత్వం వ‌ల్లే సాధ్య‌మైంద‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.

Related posts