telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతిరోజూ బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం లేదా.. ఇక ఆ సమస్యలు తప్పవు!

ప్రస్తుత బీజీ లైఫ్‌లో ఎవరూ కూడా ఆరోగ్యంపై పెద్దగా దృష్టి పెట్టడం లేదు. పొద్దున లేచిన నుంచి.. నైట్‌ పడుకునే వరకు ఫుల్‌ బిజీ అయిపోతున్నారు. ఈ బిజీలో బ్రేక్‌ ఫాస్ట్‌ చేయడం మరిచిపోతున్నారు. ఉదయం లేచి పనులకు వెళ్లే అనేక మంది సామన్య ప్రజలు ఉన్నది తింటారు లేకపోతే.. మధ్యాహ్నమే భోజనం చేస్తారు. ఇక వాళ్ల లైఫ్ లో బ్రేక్‌ ఫాస్ట్‌ అనేదే ఉండదు. అయితే.. బ్రేక్‌ ఫాస్ట్‌ ప్రతిరోజూ చేయకపోతే చాలా సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం…

మెదడు చురుకుదనం తగ్గుతుంది.
జీవక్రియలకు ఆటంకం కలుగుతుంది
గ్యాస్ట్రిక్‌ సమస్యలు వస్తాయి
తలనొప్పి సమస్య రావచ్చు
రోగనిరోధక శక్తి తగ్గే అవకాశం ఉంది
పనిపై తగినంత శ్రద్ధ పెట్టలేరు
రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి
ఎనర్జీ లెవెల్స్‌ తగ్గుతాయి

Related posts