telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

మద్యం తాగి, వాహనం నడిపిన ఐఏఎస్ అధికారి .. అరెస్ట్ .. తప్పుచేస్తే..ఎవరిని వదిలేదిలేదు..

IAS drunk and drive costs a life arrested

డ్రంక్ అండ్ డ్రైవ్ తప్పని చెప్పే అధికారులే ఆ తప్పు చేస్తే.. తాజాగా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పాత్రికేయుడి మృతికి కారణమైన కేరళ ఐఏఎస్‌ అధికారి వెంకట రామన్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒక ఆసుపత్రిలో ఉండగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఐపీసీ సెక్షన్‌ 279, 304 కింద నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు దర్యాప్తు అధికారి పేర్కొన్నారు. మొదట కారును తాను నడపలేదని, తన స్నేహితురాలైన వాఫా ఫిరోజ్‌ నడిపినట్లుగా వెంకటరామన్‌ బుకాయించే ప్రయత్నం చేశారు. ప్రత్యక్ష సాక్షులు మాత్రం వెంకటరామనే నడిపినట్లుగా చెప్పారు.

సీసీ కెమెరా ఫుటేజిలన్నీ పరిశీలించిన అనంతరం వెంకటరామనే నడిపినట్లుగా నిర్థారించుకుని అరెస్టు చేసినట్లుగా తిరువనంతపురం పోలీస్‌ కమిషనర్‌ దీనేంద్ర కశ్యప్‌ వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయుడు కె.మహమ్మద్‌ బషీర్‌ మళయాళ దినపత్రిక ‘సిరాజ్‌’ లో బ్యూరో చీఫ్‌గా పనిచేస్తున్నారు. కాగా, చదువులో మెరుగైన విద్యార్థిగా పేరున్న వెంకటరామన్‌ వైద్యవిద్యను అభ్యసించారు. అనంతరం ఐఏఎస్‌ అధికారిగా ఎంపికయ్యారు. ఆయనను గురువారమే కేరళ ప్రభుత్వం సర్వే డైరెక్టర్‌గా నియమించడం గమనార్హం.

Related posts