మాజీ మంత్రి, టీఆర్‌ఎస్ నేత తుమ్మల నాగేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2020 కలసి రాలేదు, కరోనా, అధిక వర్షాలు వచ్చి ఇబ్బందులు పడ్డమని.. కేసీఆర్ ప్రభుత్వం రైతుకు మేలు చేసే కార్యక్రమాలు చేసినప్పటికీ… ప్రకృతి వల్ల ఇబ్బందులు పడ్డమని పేర్కొన్నారు. సిఎం కేసీఆర్ కు మనము మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని…. గత ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ, పవర్ ప్రాజెస్ట్ లు విజయవంతం చేసుకున్నామన్నారు. స్వార్ధపరులు, అధికారం కోసం కొందరు తమను ఓడించారని.. అయిన కేసీఆర్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరము ఉందని పేర్కొన్నారు. రాజకీయాల్లో అటు-పోటులు, గెలుపు-ఓటములు ఉంటాయన్నారు. ఓటమి గురించి ఆలోచించకుండా రాజకీయాలను కొనసాగిస్తూ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ లన్ని కుంటుపడ్డాయని… వాటిని పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ కారణాలు ఎలా ఉన్న కొంత కాలం సర్దుకుని పోవాలని తెలిపారు ఆనాటి నుంచి ఈనాటి వరకు.. ఎన్టీ రామారావు, చంద్రబాబు, కేసీఆర్ ల సహకరంతో జిల్లాను అభివృద్ధి చేశానని స్పష్టం చేశారు.
previous post
next post
వైసీపీ సర్కారు వైఖరితో రాష్ట్రానికి పరిశ్రమలు రావడం లేదు: సోమిరెడ్డి